ఢిల్లీలో భూప్రకంపనలు,భయంతో పరుగులు.

దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాలలో భూమి కంపించింది. నోయిడా, గురుగ్రామ్‌లో కూడా భూ ప్రకంపనాలు వచ్చాయి. భూకంప తీవ్రత 4.2గా ఉంది అని శాస్త్రవేత్తలు తెలిపారు. హర్యానాలో గల గురుగ్రామ్ నైరుతి దిశలో 48 కిలోమీటర్ల దూరంలో, 7.5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అర్థరాత్రి 11 గంటల 46నిమిషాలకు భూమి కంపించిందని తెలిపారు. ఢిల్లీ భూ ప్రకంపనాలు వచ్చాయని ప్రసార భారతీ ట్వీట్ చేసింది. ఢిల్లీ మరియు పరిసర ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు బలమైన ప్రకంపనలు సంభవించినట్టు చెబుతున్నారు. దీంతో ఇళ్ల నుంచి ప్రజలకు బయటకు పరుగులు తీశారు. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్టు సమాచారం లేదు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *