మార్గశిరశుద్ద పంచమి ధనిష్టా నక్షత్ర యుక్త కుంభ లగ్నమందు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు బంగారు కిరీటముల సమర్పణ ఉత్సవం సందర్భంగా ఉదయం 8 గంటల నుండి శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి మందిరం లో గల శ్రీ వెంకటేశ్వర కల్యాణ మండపం లో ఉదయం 8 గంటల నుండి విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనం నవ కలశ ఆరాధన చతుర్దశ కలశారాధన, వాస్తు మండపారాధన విశేష పూజ అగ్ని ప్రతిష్టాపన మూర్తి హోమం వాస్తు హోమం, పర్య గ్నీ కరణ, మహా పూర్ణాహుతి, జరిగినవి స్థానిక భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు గ్రంధి శ్రీనివాస్ గారి చేతుల మీదగా స్వర్ణ కిరీటములు సమర్పణ అనంతరం శాంతి కళ్యాణం తదుపరి మహదా శీర్వచనం పాణింగిపల్లి దుర్గా నరసింహ శ్రీనివాసాచార్యులు బృందంచే నిర్వహించబడింది, సువర్ణ కిరీటము ల ప్రారంభకులు భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గ్రంధి శ్రీనివాస్ గారి చేతుల మీదగా ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకట రాజు అధ్యక్షతన కమిటీ సభ్యుల పర్యవేక్షణలో దాతల సమక్షంలో ధనిష్ట నక్షత్రం కుంభ లగ్నం లో సువర్ణ కిరీట ముల సమర్పణ జరిగింది , తదుపరి గౌరవనీయులు గ్రంధి శ్రీనివాస్ గారికి, ఉండి ఇ నియోజకవర్గం శాసనసభ్యులు మంతెన రామరాజు గార్లకు స్వామివారి శేషవస్త్రం చిత్రపటం అందజేశారు తదుపరి శ్రీవారి భక్తులు అందరికీ తీర్థ ప్రసాద వినియోగం జరిగింది.

ఈ కార్యక్రమంలో కుక్కల బాల వెంకటరత్నం, సరి పీడకల, రామారావు, తాడికొండ కోటేశ్వరరావు గుప్త, వేండ్ర వెంకట స్వామి, మెంటే పార్థసారధి, తోట భోగయ్య, సరి పిడకల వెంకటేశ్వరరావు, అల్లం రమేష్, కాకర్ల పాటి భాను కడలి వెంకటేశ్వరరావు, కడలి ఫణి కుమార్ తదితర పెద్దలు భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తరించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *