PNVTV

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్ రసవత్తరంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 6.30 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికలను ఛాలెంజింగ్‌గా తీసుకోవడంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో ఇరు వర్గాలు పరస్పరం దాడులకు కూడా దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ఎన్నో వివాదాలు, మరెన్నో నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. సవాళ్లు, ప్రతిసవాళ్లతో గత కొన్ని రోజులుగా రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఫిబ్రవరి 9న ఇవాళ తొలిదశ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్నికలు ఈ ఉదయం 6.30 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 4గంటల వరకు కొనసాగనున్నాయి.  తర్వాత ఓట్ల లెక్కింపు మొదలుకానుంది.

ఈ విషయమై రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల్ కృష్ణ ద్వివేది వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో జరగనున్న తొలిదశ పంచాయతీ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. మంగళవారం మొత్తం 3,249 పంచాయతీలో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఇప్పటికే 525 స్థానాలు ఏగ్రీవం అయ్యాయి. మిగిలిన 2723 స్థానాలకు 7506 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 32,502 వార్డ్ మెంబర్లకు గాను 12,185 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని గోపాల్ కృష్ణ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *