PNVTV

వైసీపీ నాయకుల పై ఆగని దాడులు..
చిత్తూరు జిల్లా పాకాల మండలం పాకాల పట్టణంలో ప్రకాష్ రెడ్డి అనే వైసీపీ నాయకుడు పై గుర్తుతెలియని దుండగులు దాడి చేసి దారుణంగా గాయపరిచారు. ఈ దారుణం సోమవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ప్రకాశ్ రెడ్డి తన నివాసంలో ఉండగా మాస్కులు వేసుకుని ముగ్గురు యువకులు ఇంట్లో చొరబడి ఆయనను కొట్టి పారిపోయారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు దాడికి పాల్పడిన ముగ్గురు యువకులు 20 నుంచి 25 సంవత్సరాల వయస్సు కలిగి ఉంటారని. ఈ దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని తెలిపారు ఎస్ఐ రాజశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైసీపీ నాయకుల పై జరుగుతున్న వరుస దాడుల నేపథ్యంలో పాలకులు మరియు పోలీసుల తీరుపై ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *