ఏపీ మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగుర వేస్తుందని ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పంచయతీ ఎన్నికలకు మించిన ఫలితాలు మున్సిపల్‌ ఎన్నికల్లో రాబోతున్నాయన్నారు. పార్టీ ర‌హితంగా జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో 80శాతంకు పైగా గెల్చుకున్న వైయ‌స్ఆర్ సీపీ అదే ఒర‌వ‌డిని కొన‌సాగిస్తూ ఇప్పుడు పార్టీ గుర్తు మీద జ‌ర‌గ‌బోతున్న మున్సిప‌ల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక‌ల్లో దానికి మించి ఫలితాలు సంపాదించి ఈ విజ‌యం మొత్తాన్ని ముఖ్యమంత్రి శ్రీ జ‌గ‌న్‌కు కానుక‌గా స‌మ‌ర్పించాలని సజ్జల పిలుపునిచ్చారు.

గ‌త రెండేళ్ల‌లో రాష్ట్రంలో సంక్షేమానికి గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా కొత్త ఒర‌వ‌డి సృష్టించి, ప్ర‌తి పేద‌వారి ఇంట్లో వెలుగు నింపిన‌ జగన్ గారి విజ‌న్ ను మరింత ముందుకు తీసుకువెళ్ళాలి. పార్టీ నాయ‌కుల నుంచి క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల వ‌ర‌కు అంద‌రూ స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయ‌డంవల్లనే పంచాయ‌తీ ఎన్నిక‌ల‌లో మంచి ఫలితాలు సాధించారు. అలానే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అంతా కలిసికట్టుగా పనిచేయాలి. పునాదుల‌తో స‌హా టీడీపీ కుప్ప‌కూలిపోయి, ఆఖ‌రుకు చంద్ర‌బాబు ఏకైక కోట‌గా చెప్పుకుంటున్న, కుప్పం కూడా బ‌ద్ద‌లైపోయాక మ‌తిస్థిమితం త‌ప్పి.. రాజ‌కీయంగా, ప్ర‌జ‌లకు సంబంధించిన అంశాలు వ‌దిలేసి, వాళ్ల పార్టీ వారికే అర్ధం కానీ విధంగా, అల్రెడీ డీ మోర‌లైజ్ లో ఉన్న‌వారిని మ‌రింత అగాథంలోకి నెడుతూ కొద్దిరోజులుగా చంద్ర‌బాబు మాట్లాడుతున్న అసంద‌ర్భ ప్రేలేప‌న‌లు, సంధి ప్రేలేప‌నలు అంద‌రు గ‌మనిస్తున్నారు.

మున్సిపాలిటీల‌కు జ‌రుగుతున్న‌ ఎన్నిక‌ల్లో.. ఎక్కడో ఒకచోట చెదురుమ‌దురుగా గెలిస్తే(అదికూడా డౌటే), అక్క‌డ చేయ‌లేని ప‌నుల‌ను, త‌మ ప‌రిధిలో లేని అంశాల‌ను చేర్చి మేనిఫెస్టోలో పెట్టారంటే.. వీళ్ల బ‌రితెగింపు చూస్తే ఆశ్చ‌ర్యమేస్తుంది. ఇంకా వీళ్ల మీద వీళ్ల‌కు అప‌రిత‌మైన విశ్వాసం ఉందా? జ‌నం అమాయ‌క‌త్వం మీద, ఓట‌ర్ల అమాయ‌క‌త్వం మీద చంద్రబాబుకు ఇంత భ‌రోసా ఉందా? ‌రిజక్ట్ చేసి చెత్త బుట్ట‌లో వేసినా స‌రే.. లేక వీళ్ల ప్ర‌పంచంలో వీళ్లు ఉన్నారా? అనే అనుమానం క‌లుగుతోంది. సీఎం జ‌గ‌న్ ఏ ప‌థ‌కాలైతే తీసుకువ‌చ్చారో.. అంటే రాష్ట్రంలో ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ‌ ద‌గ్గ‌ర నుంచి, రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ ఒక కుటుంబ పెద్ద‌గా చేయాల్సిన ప‌నుల‌న్నీ చేసి, ఆ ఇంట్లో మ‌నిషిగా వారి బాగోగుల‌ను అన్నీ కోణాల్లో ఆలోచించి ప్ర‌తి పేద కుటుంబంలో వెలుగులు నింపారు. ఆ వెలుగులు నింపే ప్ర‌య‌త్నంలో ఈ రెండేళ్లలో శ్రీ జ‌గ‌న్ గారు చేసిన ప‌నులన్నీ కూడా ఆయ‌న్ను ప్ర‌జ‌ల హృద‌యాల‌కు మ‌రింత ద‌గ్గ‌ర చేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *