జగనన్న తోడు, వైయస్​ఆర్ ఆసరా, చేయూత, ఉపాధి హామీ  వాలంటీర్లకు సత్కారం,  అంశాలపై సీఎం జగన్‌ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‌లో వాలంటీర్లను సత్కరించే కార్యక్రమంపై ముఖ్యమంత్రికి అధికారులు వివరాలు అందించారు. అర్హతలు ప్రకారం మూడు కేటగిరీలకు వాలంటీర్లను ఎంపిక చేయాలని ఫిక్సయ్యారు. లెవల్‌ 1 లో ఏడాదిపాటు నిరంతరంగా సేవలు అందించిన వారందరి పేర్లు పరిశీలన చేయాలన్నారు. లెవల్‌ 2లో ప్రతి మండలంలో, లేదా పట్టణంలో ఐదుగురు చొప్పున, లెవల్‌ 3లో ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు చొప్పున వాలంటీర్లకు సత్కారాలు చేయాలని నిర్ణయించారు. ఏడాదిపైగా సేవలు అందించిన వారికి సేవామిత్రతో పాటు బ్యాడ్జీ, రూ.10 వేలు నగదు పురస్కారం అందించనున్నారు. లెవల్‌–2 వారికి సేవారత్నతో పాటు, స్పెషల్‌ బ్యాడ్జ్, రూ.20వేలు అందిస్తారు. లెవల్‌ –3 వారికి సేవా వజ్రాల పేరిట స్పెషల్‌ బ్యాడ్జ్‌ తో పాటు మెడల్, రూ.30 వేల చొప్పున నగదు పురస్కారాలు అందిస్తారు. పురస్కారాల ఎంపికకు అర్హతలను అధికారులు నిర్దేశించారు. పక్షపాతం చూపకుండా, అవినీతి చేయకుండా సేవా దృక్పథాన్ని పెంచే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు.

యాప్‌ల వినియోగం, మూడు రోజుల్లోగా పెన్షన్ల పంపిణీ, హాజరు, నవరత్నాల అమల్లో భాగస్వామ్యం, కొవిడ్‌ -19 సర్వే తదితర అంశాలను పురస్కారాల ఎంపికకు ప్రామాణికంగా తీసుకున్నట్లు అధికారులు వివరించారు. ఉగాది నుంచి వాలంటీర్ల పురస్కారాల కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో మూడుచోట్ల కార్యక్రమాలకు సీఎం జగన్ హాజరవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *